ధాన్యం లారీలకు ‘చెక్‌’

ABN , First Publish Date - 2020-12-30T05:30:00+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించిన ధాన్యం లారీలను అధికారులు అడ్డుకున్నారు. ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా 50 ధాన్యం లారీలు బుధవారం ఆంధ్రాలోకి ప్రవేశించాయి. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, రెవెన్యూ అధికారులు.. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద వాటిని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే విడిచిపెట్టేది లేదని డ్రైవర్లకు స్పష్టం చేశారు.

ధాన్యం లారీలకు ‘చెక్‌’
చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్న ధాన్యం లారీలు

పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్న అధికారులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 30: ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించిన ధాన్యం లారీలను అధికారులు అడ్డుకున్నారు. ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా 50 ధాన్యం లారీలు బుధవారం ఆంధ్రాలోకి ప్రవేశించాయి. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, రెవెన్యూ అధికారులు.. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద వాటిని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే విడిచిపెట్టేది లేదని డ్రైవర్లకు స్పష్టం చేశారు. తమకు సరైన సమాచారం లేకపోవడంతో అనుమతి లేకుండా వచ్చామని డ్రైవర్లు తెలిపారు. ఈసారికి విడిచిపెట్టాలని వేడుకున్నారు. అయినా అధికారులు విడిచిపెట్టకుండా  ఆ వాహనాలను వెనక్కి పంపించారు. 

 

Updated Date - 2020-12-30T05:30:00+05:30 IST