నేటి నుంచి ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు మూత

ABN , First Publish Date - 2020-03-18T10:22:03+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు, మెట్టుగూడ జలపాతాలను బుధవారం నుంచి తాత్కాలికంగా మూసి

నేటి నుంచి ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు మూత

సీతంపేట:  కరోనా వైరస్‌ కారణంగా ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు, మెట్టుగూడ జలపాతాలను బుధవారం నుంచి తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు  పార్కు మేనే జర్‌ సవర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు మూసివేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత మరలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునఃప్రారంభిస్తామని, తదుపరి ఆ వివరాలు చెబుతామన్నారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-03-18T10:22:03+05:30 IST