బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2020-03-30T10:38:03+05:30 IST

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని ప్రభుత్వ మాజీ

బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌

ఆమదాలవలస, మార్చి 29: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ పార్టీని ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది ఎన్టీఆర్‌ అని చెప్పారు. 


కరోనాను ఎదుర్కొనేందుకు ఏంచేశారు?

కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని మాజీ విప్‌ రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, వారందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.


బూర్జ మండలంలోని చెరకు తోటల్లో పనిచేస్తున్న కృష్ణా జిల్లా వలస కార్మికులకు ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సొమ్ములతో కొన్న ఫినాయిల్‌, బ్లీచింగ్‌ తన కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న ట్రస్ట్‌ పేరుతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పంపిణీ చేయడంపై రవికుమార్‌ మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న తమ్మినేని నోటిని ఫినాయిల్‌, బ్లీచింగ్‌తో శుద్ధి చేయాలని అక్కకు సూచించారు. కార్యక్రమంలో బోర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:38:03+05:30 IST