వివాదమైతే మాకేంటి?

ABN , First Publish Date - 2020-12-28T05:19:15+05:30 IST

పలాస-కాశీబుగ్గలో ఇటీవల ‘ఆక్రమణల’ వ్యవహారం హైటెన్షన్‌కు దారితీసింది. ఆక్రమణలపై అధికార, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. కానీ ఇంతటి వివాదానికి కారణమైన స్థలాల్లో మాత్రం నిర్మాణాలు ఆగడం లేదు. ఏకంగా డూప్లెక్స్‌ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఇక్కడ నిర్మాణాలు వద్దన్న అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరవుతున్నాయి.

వివాదమైతే మాకేంటి?
ఆక్రమిత స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం


సూదికొండ కాలనీలో ఆగని అక్రమ నిర్మాణాలు

 పట్టించుకోని  అధికారులు

(పలాస)

పలాస-కాశీబుగ్గలో ఇటీవల ‘ఆక్రమణల’ వ్యవహారం హైటెన్షన్‌కు దారితీసింది. ఆక్రమణలపై అధికార, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. కానీ ఇంతటి వివాదానికి కారణమైన స్థలాల్లో మాత్రం నిర్మాణాలు ఆగడం లేదు. ఏకంగా డూప్లెక్స్‌ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఇక్కడ నిర్మాణాలు వద్దన్న అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరవుతున్నాయి. 

- సూదికొండలోని సర్వేనెంబరు 51లో 65 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిలో కొంతమందికి ఇళ్లస్థలాల కోసం ఒక్కక్కరికి 1.5  నుంచి రెండు సెంట్లు వరకూ స్థలాన్ని గతంలో ఇచ్చారు. దీంతో వారంతా ఇళ్లు నిర్మించుకున్నారు. అదేప్రాంతంలో అప్పట్లో 20 సెంట్లు కొండను చదునుచేసి  బ్రహ్మంగారి ఆలయం నిర్మించారు. అయితే దీనికి సమీపంలోని రాళ్ల గుట్టను చదును చేసి పక్కా భవనాలు నిర్మించుకుంటున్నారు. దీనికి ఆనుకొని నెమలికొండ దిగువ ప్రాంతంలో కూడా ఆక్రమణలకు పాల్పడి బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో డూప్లెక్స్‌ గృహాలు నిర్మిస్తున్నా అధికా రులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక్క డ నిర్మిస్తున్న గృహాలకు కనీసం మునిసిపల్‌  విభాగం నుం చి అనుమతులు కూడా లేకపోవడం  విశేషం. ఆక్రమిత ప్రాంతంలోనే వార్డు సచివాలయం ఉన్నా అక్కడ సిబ్బంది మౌనం వహిస్తున్నారు. అధికారులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఇటీవల  ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు సూదికొండ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతు న్నాయని, అవి వైసీపీ నాయకులకులవి కావ డంతో  తొలగించడం లేదని ఆరోపించిన విషయం విదిత మే.దీంతో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వెంటనే స్పందిస్తూ అవి టీడీపీ నాయకులవేనని, తక్షణమే తొలగిం పునకు ఆదేశిస్తామని ప్రకటించిన నేపధ్యంలో వారిరువురి మఽధ్య మాటల యుద్ధం నడిచింది. కానీ ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలు ఆగలేదు. దీనిపైనే అందరూ చర్చించుకుంటున్నా రు. ఇదే విషయంపై తహసీ ల్దారు ఎల్‌.మధుసూదనరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావిం చగా..ఆక్రమణలు గుర్తించామని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Updated Date - 2020-12-28T05:19:15+05:30 IST