-
-
Home » Andhra Pradesh » Srikakulam » New agricultural laws should be repealed
-
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T05:31:41+05:30 IST
రైతులకు నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వామపక్షాలు, కార్మికులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

పలాసరూరల్/మందస/ కంచిలి/ పాలకొండ/ పాలకొండరూరల్/ రేగిడి/ కోటబొమ్మాళి/రణస్థలం : రైతులకు నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వామపక్షాలు, కార్మికులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్‌ఐ శ్రావణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చాపర వెంకటరమణ, నెయ్యిల గణపతి, వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఫ మందసలో సీఐటీయూ నాయకులు ఆర్.దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సన్యాసి రావు, మాధవరావు, చాపర వేణు పాల్గొన్నారు. ఫ కంచిలిలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ బి.ఢిల్లీరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బి.సుందరరావు, పి.చిరంజీవులు, టి.రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫ పాలకొండలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు ఎ.లక్ష్మణరావు, బి.స్వప్న, కె.రాము, కె.గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఫ పాలకొండలో అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొండాపురంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతు సంఘ నాయకులు కిమిడి రామ మూర్తి, బుడితి అప్పలనాయుడు, లంక మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఫ రేగిడి మండలం సంకిలిలో రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు నారు జనార్దానరావు, పాలవలస రామినాయుడులు ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఫ కోటబొమ్మాళిలో సీఐటీయూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు డి.గోవిందరావు ఆధ్వర్యంలో రైతులు సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమంతు ఈశ్వరరావు, ఎం.శివ, కొర్ర గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ రణస్థలంలో రామతీర్థం జంక్షన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు.