నవ్యాంధ్రను బీజేపీ మోసం చేసింది
ABN , First Publish Date - 2020-11-16T04:52:11+05:30 IST
ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా అ న్నింటా నవ్యాంధ్రను బీజేపీ మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, కార్యదర్శి వర్గ సభ్యుడు డి. గోవిందరావులు పేర్కొన్నారు.

గుజరాతీపేట: ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా అ న్నింటా నవ్యాంధ్రను బీజేపీ మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, కార్యదర్శి వర్గ సభ్యుడు డి. గోవిందరావులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతాం గ వ్యతిరేక విధానాలను అవ లంభిస్తుందంటూ గత 15 రోజులుగా సీపీఎం చేపట్టిన ప్రజాచైతన్య ప్రచార యాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నగర సీపీఎం అధ్యక్షుడు టి.తిరు పతిరావు అధక్షతన స్థానిక ఏడు రోడ్ల కూడలి వద బహిరంగ సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ, రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న బీజేపీతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎందుకు రాజీ పడుతున్నాయని ప్రశ్నిం చారు. కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాన్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్‌లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే, ఎల్‌ఐసీ, బ్యాంకులు, టెలికాం, ఇస్రో, రక్షణరంగం, బొగ్గు, విద్యుత్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలను 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం మద్దతిస్తోందన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.