ఉత్తమ నాటికగా రాతిలో తేమ

ABN , First Publish Date - 2020-12-27T05:20:21+05:30 IST

తెనాలిలో మూడురోజులు నిర్వహించిన రాష్ట్రస్థాయి 13వ ఆహ్వాన నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా యంగ్‌ థియేటర్‌ విజయవాడవారి రాతిలో తేమ నాటిక నిలిచింది.

ఉత్తమ నాటికగా రాతిలో తేమ
విజేతలకు బహుమతులు అందిస్తున్న కళాపరిషత్‌ అధ్యక్షులు జానీబాషా

తెనాలి రూరల్‌, డిసెంబర్‌ 26: తెనాలిలో మూడురోజులు నిర్వహించిన రాష్ట్రస్థాయి 13వ ఆహ్వాన నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా యంగ్‌ థియేటర్‌ విజయవాడవారి రాతిలో తేమ నాటిక నిలిచింది. పొలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య స్మారక పద్మశ్రీ డాక్టర్‌నందమూరి తారకరామారావు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. విజేతలకు శనివారం కళాపరిషత్‌ అధ్యక్షుడు జానీబాషా బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమప్రదర్శనగా శ్రీ శృంగార వల్లభ ఆర్ట్స్‌ తిరుపతి వారి ఆఖరిమజలి నాటిక ఎంపికైంది. ఉత్తమ నటుడిగా  చెరుకూరు సాంబశివరావు, ఉత్తమనటిగా సురభి ప్రభావతి, ఉత్తమ క్యారెక్టర్‌ నటిగా బి.ఉమామహేవ్వరి, ఉత్తమ ప్రతినాయకుడిగా వి.సత్యనారాయణ, ఉత్తమ హాస్యనటుడిగా ఎ.హరిబాబు, ఉత్తమ రచయితగా కె.కాశీ, ఉత్తమ దర్శకుడిగా ఆర్‌.వాసు ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా ఎంపీ కన్నేశ్వరరావు, ప్రసాదరెడ్డి, గోపాజు విజయ్‌ వ్యవహరించారు.

Updated Date - 2020-12-27T05:20:21+05:30 IST