ఎంపిక జాబితాలో పేరున్నా...

ABN , First Publish Date - 2020-08-22T08:45:54+05:30 IST

ఇటీవల శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అర్హుల జాబితాను నోటీసు బోర్డులో పెట్టారు. ఈ జాబి

ఎంపిక జాబితాలో పేరున్నా...

ఉద్యోగంలో చేర్చుకోలేదు

 జీజీహెచ్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు 


గుజరాతీపేట: ఇటీవల శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అర్హుల జాబితాను నోటీసు బోర్డులో పెట్టారు. ఈ జాబితాలో పేరు ఉండడంతో స్టాఫ్‌ నర్సుగా చేరేందుకు కోవెలకొండ చంద్రకళ అనే మహిళ జీజీహెచ్‌కు శుక్రవారం వెళ్లారు. కానీ,  ఆమెను ఉద్యోగంలో చేర్చుకునేందుకు అధికారులు నిరాకరించారు. స్టాఫ్‌నర్సు నియామకాల్లో 190 సీరియల్‌ నంబరుతో నోటీసు బోర్డులో తన పేరు ఉందని ఆమె చెప్పినా అధికారులు వినలేదు.


దీంతో చేసేది లేక ఆమె వెనుతిరిగి వచ్చే శారు. ఈ విషయాన్ని బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్‌ ప్రభారీ పూడి తిరుపతిరావు దృష్టికి బాధితురాలు తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరింది. దీనిపై ఆయన  కలెక్టర్‌ నివాస్‌కు ఫిర్యాదు చేశారు.  చంద్రకళను ఉద్యోగంలో చేర్చుకొని ఆమెకు న్యాయం చేయాలని తిరుపతిరావు డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-08-22T08:45:54+05:30 IST