ఎట్టకేలకు నాయిరాలవలస ఎస్‌ఎంసీ ఎన్నిక

ABN , First Publish Date - 2020-09-01T09:09:27+05:30 IST

నాయిరాలవలస యూపీ పాఠశాల ఎస్‌ ఎంసీ ఎన్నిక ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. ఇప్పటికే రెండుసార్లు వా యిదా పడిన ఎన్నిక సోమవారం పాఠశాలలో

ఎట్టకేలకు నాయిరాలవలస ఎస్‌ఎంసీ ఎన్నిక

రేగిడి, ఆగస్టు 31: నాయిరాలవలస యూపీ పాఠశాల ఎస్‌ ఎంసీ ఎన్నిక  ఎట్టకేలకు  ఏకగ్రీవమైంది. ఇప్పటికే రెండుసార్లు వా యిదా పడిన ఎన్నిక సోమవారం పాఠశాలలో నిర్వహించారు. కమి టీ చైర్మన్‌గా వావిలపల్లి వెంకటరమణ, వైస్‌చైర్మన్‌గా కొవ్వాడ సూ రమ్మలను తల్లిదండ్రులు ఏకాభిప్రాయంతో ఎన్నుకొన్నట్లు హెచ్‌ఎం సాదెం తిరుపతి రావు తెలిపారు.


ఎన్నికకు 75 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. వీరిలో 24మందిని కమిటీసభ్యులుగా ఎన్నుకొన్నారు. ఎంఈవో వర ప్రసాదరావు ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరిం చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-09-01T09:09:27+05:30 IST