-
-
Home » Andhra Pradesh » Srikakulam » Naayana swami temple
-
నారాయణ స్వామి ఆలయంలో పూజలు
ABN , First Publish Date - 2020-12-28T05:31:57+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారా యణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీఎస్‌పురం, డిసెంబరు 27 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారా యణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎం.సత్యన్నారాయణ శర్మ, ఎం.ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి వారిని అలంకరించి స్వామి వారికి పంచామృతాభిషేకం, హారతులు, గోపూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మహానై వేద్యంతో గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి సమర్పించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్, దేవస్థాన చైర్మన్ దుగ్గి రెడ్డి జయరెడ్డి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించారు. భక్తు లకు అన్నదానం నిర్వహించారు.