రక్తదానానికి ముందుకు రావాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-06T05:23:17+05:30 IST
యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. గారలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం అధికారుల సహకారంతో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

గార: యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. గారలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం అధికారుల సహకారంతో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీరాములునాయుడు, డ్వామా పీడీ కూర్మారావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఎంపీడీవో రామ్మోహన్రావు, తహసీల్దార్ ఎ.రామారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బూరవిల్లి, శాలిహుండం కేజీబీవీల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.