మోపాడులో 18 అడుగులకు చేరిన నీరు
ABN , First Publish Date - 2020-12-02T05:23:41+05:30 IST
మండలంలోని మో పాడు రిజర్వాయర్‌లో నివర్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం నాటికి 18 అడుగుల మేర నీటి మట్టం చేరింది.

1.
అయిషా మసీదు వద్ద రోడ్డు దుస్థితి 2. మల్లారెడ్డినగర్ బురదమయమైన రోడ్డు 3. కొండేపల్లిలో ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీరు
అధ్వానంగా రోడ్లు.. ప్రజల అవస్థలు
నివర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాలు జల మయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మా రింది. మరికొన్ని వీధులు బురదమయమయ్యాయి. పట్టణంలోని రాజ్యలక్ష్మీనగర్, మల్లారెడ్డి కాలనీ, కొండేపల్లి రోడ్డు, భగత్ సింగ్ కాలనీ, బాపూజీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎరుకల కాలనీ, రెవెన్యూనగర్‌లతో పాటు పట్టణంలోని దత్తసాయి గుడి తదితర ప్రాంతాల్లో వీధులు అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మధ్య వర్షపు నీరు చేరింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు చాలా రోజులు నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తాయని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మూడు రోజు లుగా ఎడెతిరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పలు సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి.
- మార్కాపురం (వన్‌టౌన్)
పామూరు, డిసెంబరు 1 : మండలంలోని మో పాడు రిజర్వాయర్‌లో నివర్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం నాటికి 18 అడుగుల మేర నీటి మట్టం చేరింది. సుమారు 8 సంవత్సరాల అనంతరం రిజర్వా యర్‌లో నీరు చేరడంతో ఆయకట్టు దారుల్లో ఆనం దం వెల్లివిరుస్తోంది. ఆయకట్టు భూముల్లో వరిపైరు సాగు చేసేందుకు రైతులు సంసిద్ధమవుతున్నారు. మ రో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో తుఫాన్ ప్రభావంతోనైనా రిజర్వా యర్‌లో ఈ ఏడాది నీరు నిండుతుందని ఆయకట్టు దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.