మోదీ కృషితోనే ఎన్నికల్లో విజయం
ABN , First Publish Date - 2020-11-13T05:42:34+05:30 IST
దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని గుర్తించిన ప్రజలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగో పాలం పేర్కొన్నారు.
గుజరాతీపేట: దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని గుర్తించిన ప్రజలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగో పాలం పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం వెస్ట్ మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు 45 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు చెప్పారు. బిహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే ప్రజలు అద్భుతమైన విజయం అందించారన్నారు. ఇదేవిధంగా అందరూ కృషి చేస్తే తప్పకుండా 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార పగ్గాలు చేపడుతుందని తెలిపారు.
రణస్థలం: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్టీ విజ యనగరం జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి పావని పిలుపునిచ్చారు. గురువారం పైడిభీమవరంలో బీజేపీ సంస్థాగత ఎచ్చెర్ల నియోజకవర్గ శిక్షణ కార్యక్రమం పార్టీ ఇన్‌చార్జి నడుకుదిటి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ, దేశంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా తయారయ్యిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలరావు, జిల్లా అధ్యక్షుడు రవిబాబ్జీ, నాయకులు లంక అప్పలనాయుడు, కరాట లక్ష్మణ్, ఎస్.ఉమామహేశ్వరి, గద్దె బా బూరావు, నారాయణరావు, ఎస్.నాగేశ్వరరావు, పి.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.