సమస్యల పరిష్కారానికై పాదయాత్ర: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-11-07T05:51:50+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే ‘నాడు ప్రజల కోసం నేడు’ అనే నినాదంతో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు.

సమస్యల పరిష్కారానికై పాదయాత్ర: ఎమ్మెల్యే

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 6: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే ‘నాడు ప్రజల కోసం నేడు’ అనే నినాదంతో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ధర్మపేట, నరసింహరెడ్డినగర్‌, అశోక్‌నగర్‌, లేబర్‌కాలనీలలో పాదయాత్ర చేసి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే పాదయాత్ర ప్రారంభించారన్నారు. మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఆసిఫ్‌, 14వ వార్డు ఇన్‌చార్జి కేదార్‌నాథ్‌, ఆదిమోహన్‌రెడ్డి, రాజేశ్వరరెడ్డి, రైల్వే ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-07T05:51:50+05:30 IST