ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి

ABN , First Publish Date - 2020-11-27T05:01:26+05:30 IST

పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టాం మండలాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా ఆరున్నరేళ్లుగా ఏ పనులు జరుగుతున్నాయో తెలియ డం లేదని ఎమ్మెల్యే వి.కళావతి తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి
సీతంపేట: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి

సీతంపేట: పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టాం మండలాల్లో  ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా  ఆరున్నరేళ్లుగా ఏ పనులు జరుగుతున్నాయో తెలియ డం లేదని ఎమ్మెల్యే వి.కళావతి తెలిపారు. గురువారం సీతంపేటలో ఆర్‌డబ్ల్యు ఎస్‌ సిబ్బంది, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులతో ఐటీడీఏ పీవో సీహెచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సమీక్షించారు. గిరిజనగ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు సమకూరుస్తున్నా ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో నీరందడంలేదని తెలిపారు. నియోజకవర్గంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తంచేశారు.  రక్షిత  నీటి ట్యాంక్‌లు, సోలార్‌ ట్యాంక్‌ల పనులు నాణ్యతలోపించడంపై పీవో దృష్టికి తీసుకువచ్చారు.  ఎంపీ డీవోలు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం నిధులు ఖర్చు చేసే  పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ శ్రీనివా సరావు పాల్గొన్నారు. ఫపాలకొండ: పాలకొండలో రైతుబజార్‌ ఏర్పాటు చేయడంతో దళారీ వ్యవస్థకు చెక్‌ పడిందని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ తెలిపారు. శనివారం   నగరపంచాయతీ పరిధిలో నాగవంశంవీధి జంక్షన్‌ వద్ద  రైతు బజార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌, తహసీల్దార్‌ సోమేశ్వరారవు, ఏడీఎం బెవర శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:01:26+05:30 IST