అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-11-16T05:23:31+05:30 IST

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
మంత్రి అప్పలరాజు, కృపారాణి సమక్షంలో పార్టీలో చేరుతున్న పూర్ణచంద్రరావు



కాశీబుగ్గ, నవంబరు 15: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్‌ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జంట పట్టణాల్లో సంకల్పయాత్ర నిర్వహించారు. పలాస జూనియర్‌ కాలేజీ నుంచి కాశీబుగ్గ సంత మైదానం వరకూ వైసీపీ శ్రేణులతో కలిసి నడిచారు. కార్యక్రమానికి పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి హాజరయ్యారు. అనంతరం కాశీబుగ్గ వైఎస్సార్‌ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ పలాస అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సీఎం జగన్‌ పలాస నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తన వెంట నడిచి... గెలిపించిన  వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.  కృపారాణి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు సత్తాచాటాలని పిలుపునిచ్చారు.  


 వైసీపీలో చేరిన కోత పూర్ణచంద్రరావు

జనసేన నాయకుడు, పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు వైసీపీలో చేరారు. మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పరాజు, వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. గడిచిన ఎన్నికల్లో పూర్ణచంద్రరావు పలాస నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పీవీ సతీష్‌, సీదిరి శ్రీదేవి, దువ్వాడ శ్రీకాంత్‌, హెచ్‌ వెంకట్రావు, బళ్ల గిరిబాబు, బల్లయ్య, డి.భవానీశంకర్‌, కె.ప్రసాద్‌రావు, ప్రసాద్‌, శ్రీనివాస్‌, ఉదయ్‌కుమార్‌తో పాటు అధికసంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 




Updated Date - 2020-11-16T05:23:31+05:30 IST