పీహెచ్‌సీల భవనాలు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-06-04T09:24:18+05:30 IST

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని..

పీహెచ్‌సీల భవనాలు పూర్తి చేయండి

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని


గుజరాతీపేట:  జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) ఆదేశించారు. విశాఖ జిల్లా  పాడేరు ఐటీడీఏ భవన్‌లో ఆర్‌అండ్‌బీ, పర్యాటక శాఖల మంత్రులు ఽధర్మాన కృష్ణదాస్‌, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి నాని ఉత్తరాంధ్ర వైద్య, ఆరోగ్య శాఖపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో నూతనంగా పీహెచ్‌సీ భవనాల నిర్మా ణానికి సుమారు రూ.50 కోట్లు, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి సుమారు రూ. 48 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులను చేపట్టేందుకు ఏపీఎంఎస్‌ ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్లను ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పీహెచ్‌సీల భవనాల పనులను ఆర్‌అండ్‌బీకి, సబ్‌ సెం టర్ల పనులను పంచాయతీరాజ్‌ శాఖలకు ప్రభుత్వం బదలాయించింది. ఈ పను లపై మంత్రి నాని సమీక్షించారు.  త్వరలో టెండర్లను  పిలిచి కాంట్రాక్టర్లకు  పను లను  అప్పగించాలన్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మందులు, అంబులెన్స్‌లను సమకూర్చడంపై  వైద్యాధికారులతో మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ  రాష్ట్ర కమిషనర్‌ భాస్కర్‌, రిమ్స్‌ సూప రింటెండెంట్‌ కృష్ణమూర్తి,  వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణవేణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:24:18+05:30 IST