మునిసిపాలిటీ అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2020-10-08T09:13:47+05:30 IST

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు...

మునిసిపాలిటీ అభివృద్ధికి చర్యలు

మంత్రి సీదిరి అప్పలరాజు 


కాశీబుగ్గ/పలాస, అక్టోబరు 7: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. బుధవారం మునిసిపాలిటీ పరిధి పెంటిభద్రలో ఎస్టీ గ్రాంట్‌తో రహదారికి,  నర్సిపురంలో సీసీ రోడ్డు, హడ్కోకాలనీలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలో రూ. ఏడు కోట్లతో ఇంటింటా కులాయిల ద్వారా శుద్ధ జలం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆఫ్‌షోర్‌ పూర్తయితే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు శుద్ధజలం అందజేస్తామని తెలిపారు. కార్య క్రమాల్లో  కమిషనర్‌ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌, వైసీపీ నాయకులు హెచ్‌.వెంకటరావు, బల్ల గిరిబాబు, బల్లయ్య, డి.భవానిశంకర్‌, పి.ప్రసాద్‌రావు, బి.శ్రీను, రవి, శ్రీనివాస్‌రావు, అబ్దుల్లా, సోమేశ్వరరావు, అజయ్‌, ప్రతాప్‌, సుడియా సురేష్‌కుమార్‌, బల్లయ్య, మల్లా సురేష్‌ కు మార్‌, కోట్ని దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.ఫ జీడి మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని ఉద్దాన రైతాంగ సమస్యల పరిష్కార వేదిక  సభ్యులు యు. ఉదయ్‌కుమార్‌, మాధవరావు, చలపతిరావు కోరారు. ఈ మేరకు బుధ వారం కాశీబుగ్గలో మంత్రి అప్పలరాజును కలిసి రైతుల సమస్యలు వివ రించారు. రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అప్పల రాజు  హామీఇచ్చారు. వారితో పాటు రాజారావు, తిరుపతిరావు ఉన్నారు. ఫ పలాసలోని వైసీపీ  కార్యాలయంలో  మందస మండలం కొండాపుట్టి, బొగాబంద, చీపి, సాబకోట గిరిజనులకు ఐటీడీఏ ద్వారా చేప పిల్లలను మంత్రి అప్పలరాజు పంపిణీ చేశారు. అలాగే సముద్రంలోకి రాత్రి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సోలార్‌ ల్యాంపులను అందజేశారు. కార్యక్ర మంలో ఫిషరీష్‌ ఏడీ శ్రీనివాసరావు, ఎండీ గోపీకృష్ణ, ఎఫ్‌డీవో సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-08T09:13:47+05:30 IST