క్వారంటైన్‌ కేంద్రాలకు భోజన టెండరు రద్దు

ABN , First Publish Date - 2020-04-21T06:03:24+05:30 IST

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికి భోజనం సరఫరాకు ఖరారుచేసిన టెండర్‌ను కలెక్టర్‌ నివాస్‌ రద్దుచేశారు. ఈ టెండర్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని...

క్వారంటైన్‌ కేంద్రాలకు భోజన టెండరు రద్దు

  • - మళ్లీ టెండర్లు పిలిచిన కలెక్టర్‌ నివాస్‌
  • - ‘ఆంధ్రజ్యోతి’  కథనానికి స్పందన

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 20: జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికి భోజనం సరఫరాకు ఖరారుచేసిన టెండర్‌ను కలెక్టర్‌ నివాస్‌ రద్దుచేశారు. ఈ టెండర్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఓ వ్యక్తి కొంతమంది వ్యాపారులతో ‘రింగ్‌’ అయి టెండర్‌ దక్కించుకున్నారనే విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ అక్రమాల వ్యవహారంపై ఈ నెల 18న ‘కరోనా భోజనంపై కన్ను!’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. ఈ అక్రమాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించి.. టెండర్‌ను రద్దు చేసేశారు. నాలుగు క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు రోజుకి 2వేల మందికి మూడుపూటలా ఆహారంతో పాటు.. ఉదయం టీ నుంచి స్నాక్స్‌.. ఇలా ఏవేవి.. ఎంతెంత పరిమాణంలో మంజూరు చేయాలన్నది స్పష్టంగా టెండర్‌లో పొందుపరిచారు. ఈ టెండర్‌కు ఈ నెల 22 వరకు బిడ్స్‌ను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను, ఫోన్‌ నంబర్లను సైతం కలెక్టరేట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

Updated Date - 2020-04-21T06:03:24+05:30 IST