నీరుగారుతున్న ‘మాతృదేవోభవ’

ABN , First Publish Date - 2020-06-04T09:21:47+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలు తగ్గించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సుఖ ప్రసవాలకోసం అమలుచేస్తున్న ..

నీరుగారుతున్న ‘మాతృదేవోభవ’

పీహెచ్‌సీల్లో  సుఖ ప్రసవాలకు  నోచుకోని గర్భిణులు

ఇళ్ల వద్దే డెలివరీలు 

ఇదీ సీతంపేట ఐటీడీఏలో పరిస్థితి


సీతంపేట, జూన్‌ 3: గిరిజన ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలు తగ్గించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సుఖ ప్రసవాలకోసం అమలుచేస్తున్న మాతృదేవోభవ పథకం నీరుగారుతోంది. ఐటీడీఏ పరిధిలోని ఇళ్ల వద్దే సుఖప్రసవాలు  ఎక్కువగా జరుగుతున్నాయి. పీహెచ్‌సీలో కరోనా వైరస్‌ నేపథ్యంలో సుఖప్రసవాలకు నోచుకోని దుస్థితి నెలకొంది. 29 పీహెచ్‌సీల్లో గర్భిణులకు ప్రసవానికి ముం దేచేరేలా గతంలో ప్రయోగాత్మకంగా మాతృదేవోభవ పఽథకానికి  గతఏడాది మే ఏడో తేదీన   శ్రీకారంచుట్టారు. సీతంపేట సీహెచ్‌ సీలో ప్రత్యేక కంట్రోల్‌ రూము కూడా ఏర్పాటుచేశారు. ఈ కంట్రో ల్‌రూము ద్వారా 29 ఆరోగ్య కేంద్రాలకు జీపీఎస్‌ ద్వారా అంబు లెన్స్‌లకు అనుసంధానం చేశారు. ఈ కంట్రోల్‌ రూము ద్వారా గర్భిణి ఎప్పుడు ప్రసవం అవుతుందో ముందుగానే తెలుసుకొని ఏఎన్‌ఎం, ఆశవర్కర్‌ ద్వారా సమీపంలో ఉన్న పీహెచ్‌సీలో చేరేలా ఏర్పాటుచేశారు. ఈఏడాది 29 పీహెచ్‌సీల పరిధిలో తొమ్మిది వేల మంది గర్భిణులకు ప్రసవాలు జరుగుతాయని ముందుగా ప్రణాళికలు రూపొందించారు.


ప్రతినెలా  పీహెచ్‌సీల పరిధిలో 800 ప్రసవాలు జరగడానికి వీలుగా నివేదికలు సిద్ధం చేశారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు పీహెచ్‌సీల్లో  వైద్యసిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. అత్యవసర  సేవలు తప్ప, ఓపీ విభాగాలు కూడా తెరవడంలేదు.దీంతో గర్భిణులకు ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయి. కాగా ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని ఐటీడీఏ ఉప వైద్యాధికారి నరేష్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మర్రిపాడులో హోండెలివరీ జరిగినట్లు తన  దృష్టికి కూడా వచ్చిందని, ఈ విషయంపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-06-04T09:21:47+05:30 IST