ఫిబ్రవరి 14న నువ్వలరేవులో సామూహిక వివాహాలు

ABN , First Publish Date - 2020-12-30T06:06:34+05:30 IST

నువ్వలరేవులో ఫిబ్రవరి 14న సామూహిక వివాహాలు జరగనున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి గ్రామంలో సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఫిబ్రవరి 14న రాత్రి 12.45 గంటలకు సుముహూర్తాన్ని పురోహితులు నిర్ణయించినట్టు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు వందలాది జంటలు ఒకటి కానున్నాయి. ఆ సమయంలో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాది మంది బంధువులు, మిత్రులు వివాహాలకు హాజరవుతారు. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సందడి లేకుండా నిర్వహించడానికి నిర్ణయించినట్టు సమాచారం.

ఫిబ్రవరి 14న నువ్వలరేవులో సామూహిక వివాహాలు
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 29: నువ్వలరేవులో ఫిబ్రవరి 14న సామూహిక వివాహాలు జరగనున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి గ్రామంలో సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఫిబ్రవరి 14న రాత్రి 12.45 గంటలకు సుముహూర్తాన్ని పురోహితులు నిర్ణయించినట్టు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు వందలాది జంటలు ఒకటి కానున్నాయి. ఆ సమయంలో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాది మంది బంధువులు, మిత్రులు వివాహాలకు హాజరవుతారు. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సందడి లేకుండా నిర్వహించడానికి నిర్ణయించినట్టు సమాచారం. Updated Date - 2020-12-30T06:06:34+05:30 IST