విశాఖలో మందస యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-25T05:52:27+05:30 IST

మందస మండలం కొండలోగాం పంచా యతీ బంసుగాం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సవర ముకుందు(32) గురువారం విశాఖలో మృతి చెందాడు. ముకుందు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

విశాఖలో మందస యువకుడి మృతి
ముకుందు (ఫైల్‌)

హరిపురం : మందస మండలం కొండలోగాం పంచా యతీ బంసుగాం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సవర ముకుందు(32) గురువారం విశాఖలో మృతి చెందాడు. ముకుందు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం నాలుగు అంతుస్తుల భవనం పై నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. కాగా ముకుందుకు తల్లి తిరుపతమ్మ, తండ్రి గంగయ్య, అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. కరోనాతో వివాహం వాయిదా పడింది. రానున్న సంక్రాంతి తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్న సమయంలో మృతి చెందాడంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

Updated Date - 2020-12-25T05:52:27+05:30 IST