మీరూ బాధ్యత వహించండి

ABN , First Publish Date - 2020-03-18T10:34:44+05:30 IST

కరోనా కట్టడిలో ప్రైవేట్‌ ఆసుపత్రులకూ బాధ్యత ఉందని డీఎంహెచ్‌వో చెంచయ్య పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ

మీరూ బాధ్యత వహించండి

ప్రతి ఆసుపత్రిలో ఐదు బెడ్స్‌ కేటాయించాల్సిందే

ప్రైవేటు వైద్యులకు డీఎంహెచ్‌వో ఆదేశం


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : కరోనా కట్టడిలో ప్రైవేట్‌ ఆసుపత్రులకూ బాధ్యత ఉందని డీఎంహెచ్‌వో చెంచయ్య పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులతో కరోనా నిర్మూలన అంశంపై ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో కరోనా అనుమానిత బాధితుల కోసం కనీసం రెండు నుంచి ఐదుబెడ్స్‌ కేటాయించాలని ఆదేశించారు. కొవిడ్‌-19 ప్రబలకుండా ప్రతిఒక్కరు సహకారాన్ని అందించాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగులు గుంపులు గుంపులుగా లేకుండా చూసుకోవాలని వివరించారు.


వచ్చే సాధారణ రోగులకు కూడా ఆరోగ్యవిద్యపై అవగాహన కలిగిస్తుండాలని చెప్పారు. అలాగే ఆసుపత్రికి విదేశాల నుంచి వచ్చినవారు ఆరోగ్యపరీక్షలకు వస్తుంటే.. తక్షణమే సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి కూడా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో, నోడల్‌ అధికారి బి.జగన్నాథరావు, డీసీహెచ్‌ఎస్‌ సూర్యారావు, పీఓడీటీటీ రామ్మోహన్‌రావు, వైద్యులు అమ్మన్నాయుడు, సత్యానంద్‌, భాస్కరరావు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ప్రైవేట్‌ ఆసుపత్రిల యాజమాన్యం పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T10:34:44+05:30 IST