-
-
Home » Andhra Pradesh » Srikakulam » Locks for shops that have not paid rent
-
అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు
ABN , First Publish Date - 2020-11-22T05:05:07+05:30 IST
పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘంలో కొత్త నిబంధనల మేరకు పెంచిన అద్దెలు చెల్లించని షాపులను కమిషనర్ నారాయణ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది తాళం వేయించారు.

కొరడా ఝళిపించిన మునిసిపల్ అధికారులు
పలాస, నవంబరు 21: పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘంలో కొత్త నిబంధనల మేరకు పెంచిన అద్దెలు చెల్లించని షాపులకు కమిషనర్ నారాయణ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది తాళం వేయించారు. మహాత్మా గాంధీ, కోట్ని గురుమూర్తి షాపింగ్ కాంప్లెక్స్, ఐడీఎస్‌ఎంటీ షాపుల్లో నిబంధనల ప్రకారం అద్దెలను పెంచుతూ నోటీసులిచ్చారు. 15 రోజులు గడుస్తున్నా వ్యాపారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అధి కారులు కొరడా ఝళిపించారు. కొంతమంది అద్దె చెల్లింపునకు ముం దుకు రావడంతో రూ.15 లక్షలు వసూళ్లయింది. 2017 నుంచి అద్దె పెంచు తూ ప్రభుత్వ జీవో జారీచేసిందని కమిషనర్ నారాయణ తెలిపారు.ఈ విషయంపై ఇదివరకే నోటీసులు జారీచేసినా వ్యాపారుల నుంచి స్పందన లేదని, అద్దె చెల్లించకపోవడంతో మునిపాల్టీ నిర్వహణ భారంగా మారు తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వో అప్పలస్వామి, ఆర్‌ఐ అమర్‌నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.