గుంటూరు జిల్లా వాసులకు ముఖ్య గమనిక.. జూలై 18 నుంచి..
ABN , First Publish Date - 2020-07-17T06:12:29+05:30 IST
గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో...
జూలై 18 నుంచి గుంటూరు జిల్లా మొత్తం లాక్‌డౌన్ అమలు
గుంటూరు: జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 18 నుంచి జిల్లా మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. వారం పాటు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కరోనా తీవ్రత జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
గుంటూరు జిల్లాలో కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో గుంటూరు జిల్లాలో 287 కేసులు నమోదు కాగా.. మే నెలలో 223 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య జూన్ నెలకు అమాంతం పెరిగింది. జూన్ నెలలో గుంటూరు జిల్లాలో 1095 కరోనా కేసులు నమోదయ్యాయి. జూలై 15న గుంటూరు జిల్లాలో 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ 468 కేసుల్లో ఒక్క గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే 235 కరోనా కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.