పకడ్బందీగా ఎన్నికలు
ABN , First Publish Date - 2020-03-08T10:19:04+05:30 IST
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు

యంత్రాంగం సిద్ధం కావాలి
అప్రమత్తంగా వ్యవహరించాలి
ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు
కలెక్టర్ నివాస్
కలెక్టరేట్ మార్చి7: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శనివారం ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. అప్రమత్తంగా వ్యవహ రించాలని, ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమయానికి అనుగుణంగా పనులు పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పరిశీలన పక్కాగా జరగాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియో కెమెరాల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్ల నియామకం చేపట్టాన్నారు.
ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చేర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు కావాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిశీలన చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ విభాగాల నోడల్ అధికారులు బి.దయానిధి, ఎ.కళ్యాణ్ చక్రవర్తి, కె.కాంతిమతి, ఎల్.రమేష్, జి.శ్రీనివాసరావు, జి.నాగేశ్వరరావు, జి.చక్రధరరావు, బి.శాంతి, జీవీబీడీ హరిప్రసాద్, పి.కాశీవిశ్వనాథరావు, ఆర్.గణపతి, ఎం.మోహనరావు, పి.రజనీకాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
స్పందన కార్యక్రమం రద్దు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నం అవుతున్నందున కలెక్టర్ స్పందన, డయల్ యు వర్ కలెక్టర్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ రెండు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసిన తరువాత యథాతధంగా నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
నేటి నుంచి కోడ్ అమలు
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యిందని కలెక్టర్ తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆదివారం నుం చి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 19,02,400 మంది ఓటర్లు ఉన్నారన్నారు. త్వరలో తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. 1414 ప్రాంతాల్లో (లొకేషన్లు) గుర్తించినట్లు చెప్పారు.
మొత్తం 2,325 పోలీంగ్ సే ్టషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. వెబ్‌కాస్టింగ్, మైక్రో సిబ్బంది 20 వేల మంది అవసరం ఉంటుందన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయన్నారు. దీనికోసం 5,688 బ్యాలెట్ బాక్స్‌ల అవసరం ఉంటుందన్నారు. జిల్లాలో వెయ్యి బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, మిగతా 4,688 బాక్స్‌లను తెలంగాణ నుంచి వస్తున్నాయని చెప్పారు.
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్‌కు ఉత్తర్వులు
ప్రతీ పోలింగ్ బూత్ వద్ద అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్‌కు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ నెల 14 నుంచి 18 లోగా బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తామన్నారు. వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి తగిన శిక్షణ అందిస్తామన్నారు. మండల కేం ద్రాల్లో ఓట్ల లెక్కింపునకు స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
త్వరలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని కలెక్టర్ చెప్పారు. ఇం దుకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1182 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2వ విడత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అవకా శం కల్పించిందన్నారు.
కొన్ని పంచాయతీల్లో వాయిదా
కోర్టులో కేసు నడుస్తున్నందున జిల్లాలో కొన్ని పంచాయ తీల్లో ఎన్నికలు వాయిదా పడినట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీన ప్రక్రియలో ఉన్న ఏడు గ్రామ పంచాయతీలకు, పలాస మున్సిపాలిటీలో విలీన ప్రక్రియలో ఒక గ్రామ పంచాయతీకి ఎన్నికలు లేవన్నారు. అంతే కాకుండా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, రాజాం నగరపంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జి. చక్రధరరావు, డీపీవో రవికుమార్ పాల్గొన్నారు.