కౌలు రైతులకు రుణ సదుపాయం

ABN , First Publish Date - 2020-09-24T10:17:19+05:30 IST

పత్తి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మేలు చేకూరుతుందని శ్రీకాకుళం రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ బి.శారద అన్నారు.

కౌలు రైతులకు రుణ సదుపాయం

పరశురాంపురం(టెక్కలి), సెప్టెంబరు 23: కౌలు రైతులకు స్వయం సహాయక సాగుదారుల సంఘాలుగా ఏర్పాటు చేసి రుణాలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏడీఏ బుడుమూరు వెంకట తిరు మలరావు అన్నారు. బుధవారం  పరశురాంపురంలో కౌలురైతులతో సమావేశం నిర్వహించారు.


ఆయన మాట్లాడుతూ.. ఐదుగురు కౌలురైతులు ఒక గ్రూపుగా ఏర్పడి బ్యాంకు ఖాతా తెరవాలని, వారికి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం పొలంబడిని గ్రామం లో నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జి.రంగారావు,  లాహిరి తదితరులు పాల్గొన్నారు.


నరసన్నపేట: వ్యవసాయరంగంలో రాణించేందుకు మహిళలు ముందుకు రావాలని నైర వ్యవసాయ కళాశాల విద్యార్థినులు సూచించా రు. బుధవారం జమ్ము గ్రామంలో యోజనప్రొగ్రాంలో భాగంగా రైతులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల  విద్యార్థిని అంజశ్రీ, ఏవో మాధవీలత, కార్యదర్శి సూరప్పడు తదితరులు పాల్గొన్నారు.


రాజాం: పత్తి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మేలు చేకూరుతుందని శ్రీకాకుళం రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ బి.శారద అన్నారు. బుధవారం గడిముడిదాంలో పత్తి పంటను పరిశీలిం చారు. పత్తి తీసిన తరువాత గులాబి రంగు కాయ తొలుచు  పురుగు నివా రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పత్తి పంటను తీసిన తరువాత పెసర తెల్ల నువ్వులు, మొక్కజొన్న సాగు చేస్తే అధిక లాభం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రైతు శిక్షణా కేంద్రం ఏవో వై.సూర్య కుమారి, రాజాం ఏవో ఎం.రేణుకాసాయి తదితరులు పాల్గొన్నారు. 


పశువులను సంరక్షించాలి

హరిపురం: యాజమాన్య పద్ధతులు అనుసరించి పశువులను సంరక్షిస్తే రైతులకు మేలు జరుగుతుందని పశువైద్యాధికారి డి.శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం మందస మండలంలోని రాంపురం, బాలిగాం రైతు భరోసా కేంద్రాల్ల్లో పశువిజ్ఞానబడి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు కిల్లి ఉమాభారతి, సిబ్బంది ప్రసన్న, కల్యాణ్‌, సంతోషి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T10:17:19+05:30 IST