లాక్‌డౌన్‌లోనూ మద్యం విక్రయాల జోరు

ABN , First Publish Date - 2020-07-20T11:59:43+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కూడా శ్రీకాకుళంలో ఆదివారం జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌లోనూ మద్యం విక్రయాల జోరు

 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 19: లాక్‌డౌన్‌ సమయంలో కూడా శ్రీకాకుళంలో ఆదివారం జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. నిత్యావసరాలు మినహా ఇతర దుకాణాలు తెరవకూడదని కలెక్టర్‌ నివాస్‌ శుక్రవారం అర్ధరాత్రి  ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి వచ్చినా,  ఆదివారం ఉదయం నుంచి మద్యం దుకాణాలకు మాత్రం తెరచుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరిచి మద్యం విక్రయించడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న మందుబాబులు గొడుగులు ధరించి దుకాణాల వద్ద బారులు తీరారు. పలు దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా కొనుగోలుకు ఎగబడ్డారు.  వీరిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

Updated Date - 2020-07-20T11:59:43+05:30 IST