కళారంగాన్ని కాపాడుకుందాం: పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు
ABN , First Publish Date - 2020-12-13T05:36:08+05:30 IST
కళారంగాన్ని కాపాడుకుందాం: పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు

రాజాం : కళారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు అన్నారు. శనివారం స్థానిక కళాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కరోనా దెబ్బకు కళా కారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాసాగర్ అధ్యక్షు డు మెట్ట దామోదరావు, గౌరవ అధ్యక్షుడు చీకటి రామారావు, ప్రధాన కార్యదర్శి రంప జగదీశ్వరశర్మ, కళాకారులు పెంకి గౌరీశ్వరరావు, తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీగడ మల్లిఖార్జునరావు ప్రదర్శించిన దుర్యోధన మహాసభ, చింతామణి నాటకం ప్రజలను ఆకట్టుకున్నాయి.