సమాజ శ్రేయస్సు కోసమే చట్టాలు

ABN , First Publish Date - 2020-11-22T05:07:03+05:30 IST

సమాజ శ్రేయస్సు కోసం చట్టాలు పని చేస్తాయని జిల్లా న్యాయమూర్తి డి.రామకృష్ణ తెలిపారు. శనివారం పలా స ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో మహిళాసాధికారిత చట్టాలపై న్యాయ అవగా హన సదస్సు జరిగింది.

సమాజ శ్రేయస్సు కోసమే చట్టాలు
మాట్లాడుతున్న జిల్లా న్యాయమూర్తి రామకృష్ణ (

జిల్లా  న్యాయమూర్తి రామకృష్ణ

పలాస, నవంబరు 21: సమాజ శ్రేయస్సు కోసం చట్టాలు పని చేస్తాయని జిల్లా  న్యాయమూర్తి డి.రామకృష్ణ తెలిపారు. శనివారం పలా స  ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో మహిళాసాధికారిత చట్టాలపై న్యాయ అవగా హన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయ మాట్లాడుతూ వివాహ చట్టానికి అనుగుణంగానే న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్నారు. మహి ళలు సమస్యలపై వారిలో చైతన్యం తీసుకు వస్తామన్నారు. టెక్కలి ఆర్డీవో సూరజ్‌ధనుంజయ్‌ మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వాలు పని చేస్తున్నాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారి సునీత, జిల్లా న్యాయమూర్తి వెంకటేశ్వరరావు, పలాస న్యాయమూర్తి భాస్కరరావు, తహసీల్దార్‌ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.


12న జాతీయ లోక్‌ అదాలత్‌

కోటబొమ్మాళి: జాతీయ లోక్‌ అదాలత్‌ డిసెంబరు 12న నిర్వహించనున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. శనివారం స్థానిక కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు అధ్య క్షతన న్యాయవాదులు, పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది, స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌లో ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెండవ అదనపు జడ్జి టి.వెంకటేశ్వర్లు, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, మండల న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పల్లి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. 


సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ దోహదం

నరసన్నపేట: లోక్‌అదాలత్‌తో కేసులను సత్వరం పరిష్కరించేం దుకు అవకాశం ఉంటుందని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో పోలీసులు, న్యాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెం బరు 12న జరిగే మెగా లోక్‌అదాలత్‌లో వీలైనన్ని కేసులు పరిష్కరిం చేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట కోర్టు మెజిస్ర్టేట్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more