-
-
Home » Andhra Pradesh » Srikakulam » Latest News in Telugu
-
కొబ్బరి రైతుకు కలిసిరాని కాలం!
ABN , First Publish Date - 2020-12-30T06:00:36+05:30 IST
ఉద్దానం కొబ్బరి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. తితలీ తుపాను విలయం నుంచి ఇంకా కోలుకోలేదు. మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి లేదు. అంతర పంటల సాగుకు ఆశించిన ప్రోత్సాహం లేదు. కొద్దిపాటి ఫలసాయంపై దోమపోటు. తెల్లదోమ ఆవహించడంతో చెట్లు నాశనమవుతున్నాయి. తితలీ పరిహారం రెట్టింపు చేస్తామన్న సీఎం జగన్ హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.

తితలీ రెట్టింపు పరిహారం ఊసే ఎత్తని ప్రభుత్వం
(కవిటి)
ఉద్దానం కొబ్బరి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. తితలీ తుపాను విలయం నుంచి ఇంకా కోలుకోలేదు. మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి లేదు. అంతర పంటల సాగుకు ఆశించిన ప్రోత్సాహం లేదు. కొద్దిపాటి ఫలసాయంపై దోమపోటు. తెల్లదోమ ఆవహించడంతో చెట్లు నాశనమవుతున్నాయి. తితలీ పరిహారం రెట్టింపు చేస్తామన్న సీఎం జగన్ హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. తితలీ ముందుతో పోలిస్తే కేవలం పదిశాతం మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రతిరెండు నెలలకొసారి కాయలు తీయించే రైతులు ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకసారి కూడా తీయించలేకపోతున్నారు. దీనికి కారణం చెట్లలో పిందెలు లేకపోవడమే. ఉన్న పిందెలను తెల్లదోమ తినేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో కొబ్బరి ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. దీంతో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను మోసం చేశారు. ఉద్దానం కొబ్బరి అధికంగా కోల్‌కత్తా, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, ఒడిశా తదితరల రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఎగుమతులు నిలిచిపోవడంతో తోటల్లో కొబ్బరి నిల్వలు పెరిగిపోవడంతో దళారులు చెప్పిందే ధరగా మారింది.