అచ్చెన్నాయుడుకు నేతల అభినందన
ABN , First Publish Date - 2020-10-24T10:51:09+05:30 IST
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును శుక్రవారం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పలువురు టీడీపీ ..

టెక్కలి, అక్టోబరు 23: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును శుక్రవారం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పలువురు టీడీపీ ముఖ్య నాయ కులు కలిసి అభినందించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, ఆమె కుమార్తె గ్రీష్మ, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, నాయకుడు కాకి గోవిం దరావు, సాలూరు అసెంబ్లీ ఇన్చార్జి ఆర్పీ భంజ్‌దేవ్, తెలుగు యువత నాయకుడు రమణ పుష్పగుచ్ఛాలిచ్చి దుశ్శాలువా కప్పి అభినందించారు.
శివాజీకి అచ్చెన్న పరామర్శ
పలాస: మాజీ మంత్రి గౌతు శివాజీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరీక్షల కోసం విశాఖపట్నం వెళ్లిన శివాజీని కలుసుకొని ఆయనతో మాట్లాడారు. ఈ సం దర్భంగా అచ్చెన్నాయుడును అభినందించారు. వారితో పాటు శివాజీ సతీ మణి గౌతు విజయలక్ష్మి, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష, వెంకన్నచౌదరి ఉన్నారు.