పొంతనలేని కారణాలు చెప్పొద్దు: కళావెంకటరావు

ABN , First Publish Date - 2020-09-13T18:29:31+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధంపై..

పొంతనలేని కారణాలు చెప్పొద్దు: కళావెంకటరావు

రథం దగ్ధం ఘటనపై నిగ్గు తేల్చాలి


రాజాం(శ్రీకాకుళం): తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధంపై పోలీసులు పొంతనలేని కారణాలు చెబుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. శనివారం రాజాం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రథం దగ్ధం ఘటనపై కాలక్షేపం చేయకుండా తక్షణమే నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరి స్తోందని, దాడులను ఆరికట్టలేకపోతే మతసామరస్యం దెబ్బతింటుందని తెలి పారు. ‘ఆలయాల ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం విధివిధానాలు పాటించారు. ఈ కేసు వ్యవహారాన్ని సీబీఐకు అప్పగించేలా చర్యలు చేపట్టాలి. ఒకే మతంపై దాడులు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతా’మని కళా వెంకటరావు తెలిపారు. 

Updated Date - 2020-09-13T18:29:31+05:30 IST