జర్నలిస్టులపై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2020-12-15T06:22:59+05:30 IST

జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని ఆయా సంఘాల నాయకులు అన్నారు.

జర్నలిస్టులపై చిన్నచూపు తగదు

కలెక్టరేట్‌ : జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని ఆయా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఐజేయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భరంగా ఐజేయూ  జాతీయ ప్రత్యేక కార్యదర్శి నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్‌ కమిటీల్లో ప్రాతినిధ్యం లేకుండా అధికారులతో ఏర్పాటు చేయడం దారుణ మన్నారు. దీనిపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో బి.దయానిధికి వినతిపత్రం అందిం చారు. ఈ ఆందోళనలో జర్నలిస్టుల సంఘాల నాయకులు ఎన్‌.ఈశ్వరరావు, ఎస్‌.ప్రసాద్‌, మల్లేశ్వరరావు, జయదేవ్‌, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read more