పనితీరు మెరుగుపరచుకోకుంటే చర్యలు
ABN , First Publish Date - 2020-11-04T04:50:27+05:30 IST
గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని, లేకుంటూ తగు చర్యలు తీసుకుంటామని జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు.
జేసీ శ్రీనివాసులు
ఎల్.ఎన్.పేట: గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని, లేకుంటూ తగు చర్యలు తీసుకుంటామని జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం పెద్దకోట-1 గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి బయో మెట్రిక్ హాజరును పాటించడంలేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసి ఆమెకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఎంపీడీవో ఆర్. కాళీప్రసాదరావుకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులు సిబ్బంది పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డులు అప్‌డేటెడ్‌గా ఉంచా లన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ బి.శివశంకర్‌సత్యనారాయణ తదితరులున్నారు.