-
-
Home » Andhra Pradesh » Srikakulam » jailed by fake cops
-
నకిలీ పోలీసులకు రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా
ABN , First Publish Date - 2020-11-25T05:59:37+05:30 IST
నారాయణవనం మండలం కైలాసనాఽథ కోనకు వెళ్లే పర్యాటకులను దోచుకున్న నకిలీ పోలీసులు ఇద్దరికి మంగళవారం పుత్తూరు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రెండేళ్లు జైలు, రూ.1000 జరిమానా విధించారు.

పుత్తూరు, నవంబరు 24 : నారాయణవనం మండలం కైలాసనాథ కోనకు వెళ్లే పర్యాటకులను దోచుకున్న నకిలీ పోలీసులు ఇద్దరికి మంగళవారం పుత్తూరు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రెండేళ్లు జైలు, రూ.1000 జరిమానా విధించారు. తుంబూరు దళితవాడకు చెందిన డీవీ సాగర్, కృష్ణమరాజులకండ్రిగ ఆదిఆంధ్రవాడకు చెందిన వినోద్.. తాము పోలీసులమని చెబుతూ కోనకు వెళ్లేవారి నుంచి బంగారు చైన్లు, సెల్‌ఫోన్లు, నగదు దోచుకున్నారని 2017 లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధించిందని నారాయణవనం ఎస్‌ఐ హనుమంతప్ప తెలిపారు.