చిరు వ్యాపారులకు ప్రభుత్వం బాసట
ABN , First Publish Date - 2020-11-26T05:51:19+05:30 IST
చిరు వ్యాపారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

ఎమ్మెల్యే అమర్‌నాథ్
కొత్తూరు (అనకాపల్లి), నవంబరు 25 : చిరు వ్యాపారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పిసినికాడలో బుధవారం జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో 1128 మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.కోటి 12 లక్షల 80 వేలు చెక్కు అందజేశామన్నారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, నాయకులు మలసాల కిశోర్, దాడి రాము, దాడి ప్రసాద్, మళ్ల వెంకటరావు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం/ నర్సీపట్నం అర్బన్ : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం రుణ మంజూరు పత్రాలను బుధవారం అందజేశారు. నర్సీపట్నం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బీవీ సత్యనారాయణ 4152 మంది లబ్ధిదారులకు వీటిని అందించారు. ఎంపీడీవో జయమాధవి, వైసీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, మునిసిపాలిటీలోని వార్డు సచివాలయాల్లో జగనన్న తోడు పథకం కింద రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కమిషనర్ ఎన్.కనకరావు వీటిని లబ్ధిదారులకు అందించారు. మెప్మా అధికారులు పాల్గొన్నారు.
ఎలమంచిలి మండలంలో..
ఎలమంచిలి/ ఎలమంచిలి రూరల్ : జగనన్న తోడు పథకం చిరువ్యాపారులకు బాసగా నిలుస్తుందని వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్ అన్నారు. ఎలమంచిలి మునిసిపల్ కార్యాలయం, కృష్ణాపురంలలో పార్టీ నాయకుడు బొద్దపు ఎర్రయ్యదొర, మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణిలతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. అలాగే, ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, బయ్యవరం, పులపర్తి, పురుషోత్తపురం, రేగుపాలెం తదితర గ్రామాల్లో పలువురు వైసీపీ నాయకులు ఈ పత్రాలను అందించారు.
గొలుగొండ ..
గొలుగొండ : జగనన్న తోడు పథకం మంజూరు పత్రాలను పలువురు లబ్ధిదారులకు ఎంపీడీవో డేవిడ్‌రాజ్ ఇక్కడ అంద జేశారు. నాయకులు లెక్కల సత్యనారాయణ, గండెం ఈశ్వరరావు, కార్యరద్శులు రఘరాం తదితరులు పాల్గొన్నారు.
రాంబిల్లిలో..
రాంబిల్లి : ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న తోడు పథకం మంజూరు పత్రాలను లబ్ధిదారులకు వైసీపీ మండల అధ్యక్షుడు జి.శ్రీనుబాబు అందజేశారు. ఈవోపీఆర్‌డీ మహేశ్, వైసీపీ నాయకులు వర్మరాజు, ముసిలిరావు తదితరులు పాల్గొన్నారు.
తంగేడులో..
కోటవురట్ల : జగనన్న తోడు పథకం కిందర రుణ మంజూరు పత్రాలను అర్హులైన వారికి తంగేడులో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి సాగి సీతబాబు అందజేశారు. చిరు వ్యాపారులకు ఈ పథకం వరంలాంటిదన్నారు. పంచాయతీ కార్యదర్శి సంతోషి తదితరులు పాల్గొన్నారు.
మునగపాకలో..
మునగపాక : జగనన్న తోడు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఉదయశ్రీ రుణ మంజూరు పత్రాలు అందజేశారు. మొదటి విడతగా 1294 మందికి ఈ నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఈవోపీఆర్‌డీ పి.ప్రసాద్, ఏవో రవికుమార్ పాల్గొన్నారు.