స్థానిక ఎన్నికలంటే జగన్‌కు భయం

ABN , First Publish Date - 2020-12-08T04:50:01+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి భయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎచ్చెర్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికలంటే జగన్‌కు భయం
మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

ఎచ్చెర్ల, డిసెంబరు 7: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి భయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎచ్చెర్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపిన సీఎం జగన్‌, ఇప్పుడు ఎందుకు జడుస్తున్నారో వెల్లడించాలి. రోజురోజుకు జగన్‌కు పొలిటికల్‌ గ్రాఫ్‌ తగ్గుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ పాలనలో వింత జబ్బులు కూడా బయటపడుతున్నాయి. వ్యవస్థలను మంట కలుపుతూ, అర్ధంలేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు నెలలపాటు పోరాటం చేస్తే, టిడ్కో ఇళ్లు పంపిణీకి ప్రభుత్వం ముందుకొచ్చింది. కరోనా బాధితులు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమతమవుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని కళా వెంకటరావు విమర్శించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.110 కోట్లతో మంజూరు చేసిన నీటి పథకం పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నారాయణపురం ఆధునీకరణ పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు, ఉపాధి హామీపథకం, ఇతర నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బెండు మల్లేశ్వరరావు, వావిలపల్లి రామకృష్ణ, మెండ రాజారావు, మూకళ్ల భాస్కరరావు, ఉంగటి మల్లేశ్వరరావు, బచ్చు కోటిరెడ్డి, పైడి అన్నంనాయుడు, బోర శ్రీనివాసరావు, గట్టెం శివరామ్‌, సీపాన ఎర్రన్నాయుడు, కొత్తకోట అమ్మినాయుడు, గూరు రాజు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-08T04:50:01+05:30 IST