-
-
Home » Andhra Pradesh » Srikakulam » It is a government of abolition
-
ఇది రద్దుల ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-11-28T05:07:45+05:30 IST
రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు.

టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
ఆమదాలవలస, నవంబరు 27: రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ముద్దాడపేట-గండ్రేడు గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణానికి రూ.60కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే వాటిని రద్దు చేయించిన ఘనత స్పీకర్ సీతారాంకే చెల్లుతుందని విమర్శించారు. ముద్దాడపేట-కణుగులవలస రహదారి నిర్మాణానికి పీఎంజీఎస్‌వై నిధులు మంజూరు చేస్తేవాటిని కూడా రద్దు చేశారన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి పనులు కూడా రద్దు చేయడం దారుణమన్నారు. అభివృద్ధి పనులను రద్దు చేసేందుకా ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుందని అని ఆయన ప్రశ్నించారు. ముద్దాడపేట వద్ద బ్రిడ్డి నిర్మాణం చేపడితే తమ్మినేనికి వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. అక్కడ బ్రిడ్డి నిర్మాణం జరిగితే ఆమదాలవలస, పొందూరు మండలాలు అబివృద్ధి చెందడమే కాకుండా రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాని కోరారు. వైసీపీకి ఓటువేస్తే అవినీతికి ఓటు వేసినటేనని అన్నారు. సమావేశంలో నాయకులు సనపల డిల్లీశ్వరరావు, నూకరాజు, కోరుకొండ రమణమూర్తి పాల్గొన్నారు.