జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-20T17:48:57+05:30 IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక న్యాయ..

జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుజరాతీపేట(శ్రీకాకుళం): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ.. విభిన్న ప్రతిభా వంతులు, స్వచ్ఛంద సంస్థలకు జాతీయ పురస్కారాలను అందజేయనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు కె.జీవన్‌బాబు శనివారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివ్వాంగుల పునరావాసం, స్వయం ఉపాధి, ఉద్యోగకల్పన, సాంకేతికత, క్రీడలు, అవరోధ రహిత వాతావరణం, అత్యుత్తమ సృజనాత్మకత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన వయోజనులు, చిన్నా రులు, ఉత్తమ బ్రెయిలీ ప్రెస్‌, తదితర  రంగాల్లో ప్రతిభావంతులు, స్వచ్ఛంద సం స్థలు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళంలోని తమ కార్యాలయానికి మూడు సెట్ల దరఖాస్తులను పంపించాలని తెలిపారు. పూర్తి వివరా లకు 08942-240519 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.  

Updated Date - 2020-09-20T17:48:57+05:30 IST