దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-05T08:57:42+05:30 IST

భామిని, మెళియాపుట్టిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు ఐటీడీఏ పీవో శుక్రవారం తెలిపారు...

దరఖాస్తుల ఆహ్వానం

సీతంపేట : భామిని, మెళియాపుట్టిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు ఐటీడీఏ పీవో శుక్రవారం తెలిపారు. లాటరీ పద్ధతిలో సీట్లు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.  


డిప్యూటేషన్‌లో పనిచేసేందుకు...

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పీఎంఆర్‌సీలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి గల ఇన్‌ సర్వీస్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు ఐటీడీఏ పీవో తెలిపారు. అకాడమిక్‌ మోనటరింగ్‌ అధికారి, గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి పోస్టులకు సంబం ధించి ఈనెల 14వ తేదీలోగా గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాల యానికి అందించాలన్నారు. ఈ పోస్టుల్లో కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసి ఉండాలన్నారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్‌ ఉపాధ్యాయులు మినహా మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


Updated Date - 2020-09-05T08:57:42+05:30 IST