కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-02T05:19:24+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, బీఈడీ కళాశాలలు రెగ్యులర్ అఫిలియేషన్ కోసం దర ఖాస్తు చేసుకోవాలని వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ సూచించారు. మంగళ వారం కళాశాలల నిర్వహణ, బలోపేతంపై సమీక్షించారు.

వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ
ఎచ్చెర్ల, డి సెంబరు 1: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, బీఈడీ కళాశాలలు రెగ్యులర్ అఫిలియేషన్ కోసం దర ఖాస్తు చేసుకోవాలని వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ సూచించారు. మంగళ వారం కళాశాలల నిర్వహణ, బలోపేతంపై సమీక్షించారు. వర్సిటీ పరిధిలో శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ ఉందన్నారు. మునసబుపేటలోని గాయత్రి డిగ్రీ కళాశాలకు, రాజాంలోని జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ అఫిలియేషన్ ఉన్నాయని చెప్పారు. వర్సిటీ పరిధిలో 101 డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ అఫిలియేషన్ లేనివన్నీ ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు, అర్హతల మేరకు ముందుగా ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తామన్నారు. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు. వర్సిటీ పరిధిలో 16 బీఈడీ కళాశాలలు ఉండగా.. ఒక్కదానికీ రెగ్యులర్ అఫిలియేషన్ లేద న్నారు. ఈ కళాశాలలు ఈ నెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం, పలాసలోని రెండు డిగ్రీ కళాశాలలు ఈ ఏడాది అడ్మిషన్ల నుంచి తప్పుకున్నాయని, మిగిలిన కళాశాలన్నింటినీ అఫిలియేష న్ కమిటీలు పరిశీలించాయని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్ర మానవ వనరుల శాఖ సిఫారసుల మేరకు నూతన విద్యా విధా నాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు వీసీ రాంజీ చెప్పారు. ఈ సమావేశంలో వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.కామరాజు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.