అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-02-08T09:50:59+05:30 IST
జిల్లాలోకలెక్టరేట్, ఫిబ్రవరి 7: జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో (కాంట్రాక్ట్ పాతిపదికన) పనిచేసేందుకు ఆసక్తి

కలెక్టరేట్, ఫిబ్రవరి 7: జిల్లాలోకలెక్టరేట్, ఫిబ్రవరి 7: జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో (కాంట్రాక్ట్ పాతిపదికన) పనిచేసేందుకు ఆసక్తి గల యువతీ, యు వకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎ.శ్రీనివాసులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు 40 ఏళ్ల లోపు వయస్సు, కంప్యూటర్‌పై పరిజ్ఞానం, కామర్స్ పట్టభద్రులై ఉండాలన్నారు. అలాగే.. ఐపీసీసీ ఆఫ్ సీఏ, ఐసీడబ్ల్యూఎ పార్ట్-ఎ లో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ నెల 15 సాయంత్రం 5 గంటలలోగా జీటీ రోడ్డులోని జిల్లా సహకార బ్యాం కు, రెండో అంతస్తులోని పౌరసరఫాల సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.