రవాణా వాహనాల కోసం నేడు ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2020-12-04T05:09:11+05:30 IST
ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు రాయితీపై మినీ ట్రక్కులను(రవాణా వాహనాలను) పంపిణీ చేయనుంది.

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 3 :
ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు రాయితీపై మినీ
ట్రక్కులను(రవాణా వాహనాలను) పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ,
మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా వీటిని అందజేయనుంది. జిల్లాలో 526 వాహనాల
పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. చాలా మంది పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో
దరఖాస్తుదారులకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి.. వాహనాలు
అందజేయనున్నారు. బీసీ అభ్యర్థులకు శుక్ర, శనివారాల్లో ఇంటర్వ్యూలు
నిర్వహించనున్నట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ రాజారావు గురువారం ఒక ప్రకటనలో
పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు విధిగా హాజరుకావాలని కోరారు. కమిటీ
సభ్యులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాయితీపై వాహనాలు అందజేయనున్నట్టు ఆయన
తెలిపారు.
నేడు ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రాంతాలు:
శ్రీకాకుళం
నగరపాలక సంస్థ, శ్రీకాకుళం రూరల్, పలాస మునిసిపాల్టీ, పలాస రూరల్,
ఇచ్ఛాపురం మునిసిపాల్టీ, ఇచ్ఛాపురం రూరల్, ఆమదాలవలస మునిసిపాల్టీ,
ఆమదాలవలస రూరల్, రాజాం నగర పంచాయతీ, రాజాం రూరల్, పాలకొండ నగర పంచాయతీ,
పాలకొండ రూరల్, పోలాకి, కంచిలి, సోంపేట, హిరమండలం, లావేరు, రణస్థలం,
పొందూరు, జి.సిగడాం, సంతబొమ్మాళి, నందిగాం, నరసన్నపేట, పాతపట్నం,
మెళియాపుట్టి, వంగర, వీరఘట్టం, కొత్తూరు, కోటబొమ్మాళి.
వజ్రపుకొత్తూరు, జలుమూరు, మందస, కవిటి, సారవకోట, రేగిడి, భామిని, గార, సంతకవిటి, ఎచ్చెర్ల, టెక్కలి, సీతంపేట, బూర్జ, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట మండలాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించునున్నట్లు ఈడీ రాజారావు తెలిపారు.