‘తుక్కు వ్యర్థాల్లో మీటర్ల’పై విచారణ
ABN , First Publish Date - 2020-10-08T09:08:49+05:30 IST
మండలంలోని జగన్నాథవలస గ్రానైట్ పరిశ్ర మలో విద్యుత్ మీటర్లు నిరుపయోగంగా పడివేసిన సంఘటనపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించారు...

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
వంగర: మండలంలోని జగన్నాథవలస గ్రానైట్ పరిశ్ర మలో విద్యుత్ మీటర్లు నిరుపయోగంగా పడివేసిన సంఘటనపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘తు క్కు వ్యర్థాల్లో మీటర్లు’ శీర్షికతో వచ్చిన కథనానికి ఏఈ సురేష్ స్పందించి సిబ్బందితో కలిసి సదరు ప్రవేశానికి వెళ్లి మీటర్లను పరిశీలించారు. పాలకొండ ఏడీఈ దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మీటర్లను కార్యాలయానికి తరలించారు. మీటరు యజమానులు చెల్లించాల్సి బిల్లులు గుర్తించారు. నీలయ్య వలసకు చెందిన వారికి ఎలా మీటర్లు మంజూరు చేశారన్న కోణంలో దర్యాప్తు చేసి నివేదించనున్నట్లు ఏఈ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.