ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి

ABN , First Publish Date - 2020-03-25T10:56:32+05:30 IST

ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని గ్రామ వలంటీర్లు, వీఆర్వోలను తహసీల్దార్‌ బి.రాజమోహన్‌ ఆదేశించారు.

ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి

సారవకోట, మార్చి 24: ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని గ్రామ వలంటీర్లు, వీఆర్వోలను తహసీల్దార్‌ బి.రాజమోహన్‌ ఆదేశించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే సమాచారం తక్షణం తెలియజేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ప్రజలు అప్రమత్తతతో ఉండి ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

Read more