పెరుగుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-23T10:07:09+05:30 IST

పట్టణంతో పాటు మండలంలో సోమవారం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ పి.అమల తెలిపారు.

పెరుగుతున్న కరోనా

వివిధ గ్రామాల్లో బయటపడుతున్న పాజిటివ్‌ లక్షణాలు

కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తున్న అధికారులు

 ఇచ్ఛాపురంలో ఏడుగురికి...


ఇచ్ఛాపురం/ రూరల్‌, జూన్‌ 22: పట్టణంతో పాటు మండలంలో సోమవారం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ పి.అమల తెలిపారు. పట్టణంలో పాజిటివ్‌ వచ్చిన నలుగురిని సంతబొమ్మాళి క్వా రంటైన్‌కు తరలించామని చెప్పారు. ఈ ప్రాం తంలో ఉన్న  37 మందికి  పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అలాగే మండలంలోని ఓ గ్రామంలో ముగ్గురిని గుర్తించామన్నారు. కొద్దిరోజుల కిందట చెన్నై నుంచి వలస వచ్చిన ఒక కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. వారికి కరోనా పరీక్షలు చేయగా భార్యాభర్తలతో పాటు కుమారుడికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు గుర్తించి వారిని సోమవారం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించామన్నారు. పట్టణంతో పాటు ఆ గ్రామాల్లో తహసీల్దార్‌ అమల, ఎంపీడీవో బి.వెంకటరమణ, రూరల్‌ ఎస్‌ఐ కె.లక్ష్మి పర్యటించి కంటైన్మెంట్‌జోన్లలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు. శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. 


మరో రెండు..

నందిగాం: మండలంలోని రెండు గ్రామా ల్లో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎన్‌. రాజారావు తెలిపారు. వారికి ప్రాథమిక పరీక్ష ల్లో పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వారితో పాటు కు టుంబ సభ్యులను  శ్రీకాకుళం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించామన్నారు. వారి తో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల వివరాలు సేకరి స్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లో తహసీల్దా ర్‌ రాజారావు, ఎంపీడీవో రాజేశ్వరరావు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. 


మరొకరికి..

 మెళియాపుట్టి: మండలంలో ఒక గ్రా మానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రిపో ర్టు వచ్చినట్లు తహసీల్దార్‌ దామోదరరావు తెలిపారు. ఈ వ్యక్తి 17 రోజుల కిందట బెంగళూరు నుంచి స్వగ్రామానికి రాగా మొదటి సారి చేసిన పరీక్షలో నెగిటివ్‌ వచ్చిం దని, మరోసారి ఈనెల 16న చేయగా పాజిటివ్‌గా నిర్థారణ అయిందన్నారు. ఈ వ్యక్తి సోమవారం శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇప్ప టికే మూడు కేసులు నమోదు కాగా ఈ వ్యక్తి గ్రామంలో కలియతిరగడంతో గ్రామస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చిన సమాచారం మేరకు టెక్కలిలో పోలీసులు ఇతడిని పట్టుకుని టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఇతడి కుటుంబ సభ్యులు ఉపాధి పనులకు సైతం వెళ్లడంతో వారి వివరాలు సేకరిస్తున్నట్లు చాపర వైద్యా ధికారి గణపతిరావు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.


మరో కేసు నమోదు

పాతపట్నం: మండల పరిధిలోని ఓ గ్రామంలో గతంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన కుటుంబంలోని మరో వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తహసీల్దార్‌ ఎం. కాళీప్రసాద్‌ తెలిపారు. దీంతో  వ్యక్తిని రాగోలు జెమ్స్‌కు సోమవారం తరలించినట్లు చెప్పారు. కాగా ఈ గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. మండలంలో తొలిసారి కరో నా కేసు నమోదైన గ్రామంలోని ఓ కాలనీకి చెందిన 56 ఏళ్ల మహిళ క్యాన్సర్‌తో సోమవారం ఉదయం మృతి చెందింది. అయితే ఈ మె నివసించే ప్రాంతం కంటైన్మెంట్‌గా ఉండ డంతో మృతదేహానికి కరోనా పరీక్షలు చేయా ల్సి ఉండగా ఇక్కడి కరోనా నిర్ధారణ కేంద్రం సోమవారం మూసివేయడంతో పరీక్షల నిమి త్తం నమూనాలను శ్రీకాకుళం పంపారు. నెగిటివ్‌ రిపోర్టు రావడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రా మాల్లో ఎంపీ డీవో పీజే ప్రసాద్‌, ఈవోపీఆర్డీ నరసింహ ప్రసాద్‌ సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Updated Date - 2020-06-23T10:07:09+05:30 IST