కరోనా బాధితుల గుర్తింపులో.. ఉదాసీనత వద్దు

ABN , First Publish Date - 2020-09-18T09:32:17+05:30 IST

కరోనా బాధితులను గుర్తించడంలో ఉదాసీనత పనికిరాదని కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. గురువారం స్థాని

కరోనా బాధితుల గుర్తింపులో.. ఉదాసీనత వద్దు

 జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించాలి 

 నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 

 కలెక్టర్‌ నివాస్‌ 


సంతకవిటి, సెప్టెంబరు 17: కరోనా బాధితులను గుర్తించడంలో ఉదాసీనత పనికిరాదని కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ,  కరోనా నివారణ చర్యలపై క్షేత్రస్థాయి నుంచి మండల, క్లస్టర్‌ స్థాయి అధికారుల వరకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


‘వాల్తేరు, సిరిపురం, ఎస్‌.రంగారాయపురం, తదితర గ్రామాల్లో కరోనా బాధి తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అన్ని గ్రామాల్లో కరోనా బాధితులు న్నప్పటికీ వారిని గుర్తించే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించాలి. కరోనా లక్షణాలతో బాధపడేవారిని  పీహెచ్‌సీకి తరలించి పరీక్షలు చేయించాలి.


హోంక్వారంటైన్‌లో ఉండేవారిపై  క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు మం దులు పంపిణీ చేయాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, మండల ప్రత్యేకాధికారి మాణిక్యాలరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో పైల నవీన్‌కుమార్‌, డీటీ చిన్నారావు, వైద్యాధికారులు, ఎస్‌ఐ రామారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-18T09:32:17+05:30 IST