-
-
Home » Andhra Pradesh » Srikakulam » IIIt exmis
-
ప్రశాంతంగా ట్రిపుల్ ఐటీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-06T05:50:29+05:30 IST
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చే శారు.

కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సురేష్
మార్కాపురం (వన్‌టౌన్), డిసెంబరు 5 : ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చే శారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మందికి 236 మంది, జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 200 మందికి 190 మంది, పూల సుబ్బయ్య కాలనీలోని ము న్సిపల్ ఉన్నత పాఠశాలలో 90 మందికి 87 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలోని పరీక్షా కేం ద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ పరిశీలించారు. ఈయన వెంట ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఉన్నారు.