మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించండి: జేసీ

ABN , First Publish Date - 2020-12-12T05:28:33+05:30 IST

గ్రామాల్లో మరుగుదొడ్లులేని ఇళ్లను గుర్తించి జాబితాలను గ్రామ సచివాలయంలోఉంచాలని జేసీ శ్రీనివాసులు కోరారు.

మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించండి: జేసీ

 



నరసన్నపేట:గ్రామాల్లో మరుగుదొడ్లులేని ఇళ్లను గుర్తించి జాబితాలను గ్రామ సచివాలయంలోఉంచాలని జేసీ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం తెల్లవారుజామున  మడపాంలో  ఆరుబయట మలవిసర్జనపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ  ఆరుబయట మలవిసర్జన చేస్తున్న వారిని  వలం టీర్లు  గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. మరుగుదొడ్లు లేనివారికి గ్రామ శివారుల్లో ప్రభుత్వస్థలంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు.   కార్యక్రమంలో డీపీవో రవికుమార్‌,ఎంపీడీవో జీవీ రవికుమార్‌, పంచాయతీ కార్యదర్శి చిన్నారావు, వీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.ఫ  పోతయ్యవల సలో నిర్వహించిన కార్యక్రమంలో డీపీవో రవికుమార్‌ పొల్గొని అవగాహన కల్పిం చారు. కాగా నరసన్నపేట, జమ్ము, తామరాపల్లి, కంబకాయి, కోమర్తి, ఉర్లాం సచివా లయ సిబ్బంది గ్రామాల్లో అవగాహన నిర్వహించారు. ఫ పోలాకి : ప్రజలు రహదారుల ఇరుపక్కల బహిరంగ మలవిసర్జన చేస్తే జరిమానా విధిస్తామని దీర్గాశి సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం  తెల్లారుజామున ఐదు గంటలకే కింజరాపువానిపేట రహదారిలో  సచివాలయ ఉద్యోగులు బహిరంగ మలవిజర్జనపై అవగాహన కల్పించారు.ఫ ఆమదాలవలస రూరల్‌: ప్రభుత్వం ప్రతిఇంట్లోనిర్మిస్తున్న మరుగుదొడ్లు  వినియోగంలోకి తీసుకురావాలని ఈవోపీఆర్డీ రేణుక పిలుపునిచ్చారు.శుక్రవారం వేకువజామున దూసి గ్రామ సచివాలయం పరిధిలో ఆరుబయట మలవిసర్జన చేసే వార్ని గుర్తించి అవగాహన సదస్సు నిర్వ హించారు.కార్యక్రమంలో దూసి సచివాలయ కన్వీనర్‌ పి.సింహాచలం,  కార్యదర్శు లు నరేష్‌, పి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఫ భామిని: గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రకు ప్రతిఒక్కరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో వీఆర్వో గోపాలరావు, సచివాలయ సిబ్బంది సంతోష్‌లక్ష్మి, ప్రమోద్‌ పాల్గొన్నారు. 

‘నాడు-నేడు’ పనులు త్వరగా పూర్తి చేయండి

మందస/హరిపురం: నాడు-నేడు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయా లని జేసీ జె.శ్రీనివాసులు  తెలిపారు. శుక్రవారం  మందస తహసీల్దార్‌ కార్యాల యంలో సచివాలయం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ-సర్వీసెస్‌ వెల్ఫేర్‌ ప్రొగ్రాం, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో తహసీల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో తిరుమలరావు, ఈవోపీఆర్‌డీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫసచివాలయ భవన నిర్మాణాల్లో నాణ్యతా లోపాలుంటే చర్యలు తప్పవని జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు. మందస మండలంలోని బీఎస్‌పురంలోని సచివాలయ భవన నిర్మాణాన్ని, నాడు- నేడు పనులను   పరిశీలించారు. ఫ పోలాకి: సుసరాం ప్రాఽథమిక పాఠశాలలో చేపడుతున్న నాడు-నేడు భవన పనులను వమరవిల్లి డైట్‌ మానటరింగ్‌ బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం డి.రామారావు, ప్రాఽథమిక పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాలరావు పాఠశాలలో అమలుచేస్తున్న విద్యాకార్యక్రమాలపై అడిగితెలుసుకున్నారు. 

రూర్బన్‌ పనులు వేగవంతం చేయాలి

సోంపేట: సోంపేట మండలంలో రూర్బన్‌ పథకంలో కేటాయించిన నిధులతో పనులు వేగవంతం చేయాలని జేసీ శ్రీనివాసులు కోరారు.శుక్రవారం సోంపేటలో  రూర్బన్‌ పథకంపై  అధికారులతో  సమీక్షించారు. ఈ సందర్భంగా రూర్బన్‌ పథకంలో చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు.  సమావేశంలో రూర్బన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ ఇందిరా ప్రియదర్శిని, ఎంపీడీవో  శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.



 నరసన్నపేట :మడపాంలో ఆరుబయట మలవిసర్జనపై అవగాహన కల్పిస్తున్న జేసీ శ్రీనివాసులు, డీపీవో రవికుమార్‌ 


Updated Date - 2020-12-12T05:28:33+05:30 IST